![]() |

ఆట డాన్స్ షో లేటెస్ట్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఈ ఎపిసోడ్ కి ఆచంట మహేష్ వచ్చి ఫుల్ ఎంటర్టైన్ చేసాడు. రాగానే వెరైటీ డాన్స్ వేస్తూ అందరినీ నవ్వించాడు. ఇంతలో హోస్ట్ సుధీర్ వచ్చి "ఫ్రెండ్ వచ్చినప్పుడు మర్యాద ఇవ్వాలి" అన్నాడు. "ఫస్ట్ వాటర్ ఇవ్వాలి" అన్నాడు మహేష్. "నువ్వు ఇండస్ట్రీకి రాకముందు ఇప్పటికీ తేడా ఏంటి చెప్పు" అన్నాడు సుధీర్ . "ఇండస్ట్రీకి రాక ముందు నా దగ్గర డబ్బు లేదు ప్రశాంతత ఉండేది.. కానీ ఇండస్ట్రీకి వచ్చాక రెండూ లేవు " అన్నాడు. "సినిమాల సంగతేంటి చెప్పు" అన్నాడు సుధీర్. "అక్షరాలా మూడు పాన్ ఇండియా సినిమాలు డౌన్ లోడ్ చేసాను. నువ్వు ఖాళీగా ఉన్నప్పుడు చెప్పు ఇద్దరం కలిసి చూద్దాం " అన్నాడు మహేష్.
ఇక అక్కడే ఉన్న మెంటార్ వంశీ "ఒక సినిమా బాగా ఫేమస్ మహేష్ ది.. నేను నాగార్జున అని " అన్నాడు. "సినిమా తరువాత దొరకవు అన్నాన్నేను . ఆరు నెలల వరకు నాకు సినిమాలు దొరకలేదు " అన్నాడు మహేష్. ఇక మహేష్ పిచ్చి పిచ్చిగా డాన్స్ చేస్తూండేసరికి "ఫిట్స్ వచ్చి అలా కొట్టుకుంటుంటే తాళాలు చేతిలో పెట్టాలని తెలీదా" అంటూ విష్ణు ప్రియా మండి పడింది.
![]() |